Telangana Praja Jagruthi: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అడుగు వేశారు. ఆమె తన నూతన రాజకీయ పార్టీ పేరును ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా ఖరారు చేశారు. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం గత జనవరి 23వ తేదీనే ఆమె భారత ఎన్నికల సంఘానికి (ECI) దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో, రిజిస్ట్రేషన్ దరఖాస్తును త్వరగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Read Also:Kavitha New Party: కవిత కొత్త పార్టీ పేరు ఇదే!
ఈసీ వివరణతో ఉత్కంఠ
ఈ పిటిషన్‌పై గతంలో జరిగిన విచారణలో ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కీలక విషయాలను కోర్టుకు వివరించారు. ఫిబ్రవరి 27న జరిగిన విచారణ సందర్భంగా, కవిత సమర్పించిన పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. ఈ లోపాల కారణంగానే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఈసీ పేర్కొంది.
ఎన్నికల సంఘం ఏం చెప్పనుంది?
ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఎన్నికల సంఘం ఎత్తిచూపిన లోపాలకు కవిత తరఫు న్యాయవాదులు ఇచ్చే వివరణపై ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: