తెలంగాణ పోలీస్(Telangana Police) శాఖ మతపరమైన దీక్షల పాలనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. డ్యూటీలో ఉన్న సమయంలో ఎలాంటి దీక్షలు పాటించేందుకు అనుమతి ఉండదని, అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా సెలవులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎస్. కృష్ణకాంత్‌కు శాఖ మెమో జారీ చేసింది.
అయన అయ్యప్ప దీక్షలో ఉండటం వల్ల డ్యూటీలో నల్ల దుస్తులు ధరించడం, జట్టును పెంచుకోవడం, గడ్డం ఉంచుకోవడం వంటి అంశాలను పై అధికారులు అభ్యంతరంగా పేర్కొన్నారు. దీనిపై సౌత్ ఈస్ట్ జోన్ ఏడీసీపీ శ్రీకాంత్(ADCP Srikanth) అధికారికంగా నోటీసు ఇచ్చారు. ఈ చర్య సోషల్ మీడియా(Social media)లో పెద్ద చర్చకు దారితీసింది. ఏడీసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
ఈ ఆదేశాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తప్పుబట్టారు. పండగల సమయంలో దీక్షలు చేయడం సహజమని, పోలీస్ శాఖ అనవసర నియమాలు ఎందుకు అమలు చేస్తోందని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, మతపరమైన ఆచారాల ఆధారంగా మారకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు జుట్టు, గడ్డం పెంచుకోవడం, బూట్లేమీ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో విధులు నిర్వహించడం అనుమతించబోమని మెమోలో స్పష్టం చేశారు. దీక్ష చేయాలనుకునే పోలీస్ సిబ్బంది అధికారికంగా సెలవులు తీసుకోవాలనే సూచన ఇచ్చారు.
హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ
ఈ ఆదేశాలను విశ్వ హిందూ పరిషత్ (VHP) తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. అయ్యప్ప దీక్ష కారణంగా ఎస్‌ఐపై చర్యలు తీసుకోవడం హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ, ఏడీసీపీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కోరింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: