తెలంగాణ పోలీసు (Telangana Police)లు సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి వీడియోను చూసిన వెంటనే ఫార్వార్డ్ చేయకూడదని సూచించారు.ఇటీవలి కాలంలో మార్ఫింగ్ వీడియోలు అధికంగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖుల వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తప్పుడు వీడియోలు తయారు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలని, కంపెనీలను ప్రమోట్ చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.(Deep Fake Videos)
పోలీసుల స్పష్టమైన హెచ్చరిక
“సోషల్ మీడియాలోని ప్రతి వీడియో నిజం కాదు. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయవద్దు” అని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు.డీప్ ఫేక్ టెక్నాలజీ (Deepfake technology) తో తప్పుడు ప్రచారాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఇవి విద్వేషాలను రేపే అవకాశం ఉందని తెలిపారు.
నిజానిజాలు తెలుసుకోవడం ముఖ్యమే
వీడియోల నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని పంచుకోవద్దని పోలీసులు సూచించారు. తప్పుడు ప్రచారాలకు సహకరించరాదని హెచ్చరించారు.మీకు నకిలీ వీడియోలు కనిపిస్తే వెంటనే వాటిని రిపోర్ట్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also : Raja Singh : ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : రాజాసింగ్