Telangana: ‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

Read Time:  1 min
Telangana: ‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా
FONT SIZE
GET APP

Telangana: తెలంగాణ రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాకేంద్రీకృత విధానాలను, ఆర్థిక లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Mahabubabad: వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కలు

తెలుగులో ప్రసంగం.. శాంతికాముక ప్రజలకు శుభాకాంక్షలు

గవర్నర్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. “శ్రమించేతత్వంగల శాంతికాముక తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు” అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

Telangana: 'People-centric governance is our policy' - Governor Shiv Pratap Shukla
Telangana: ‘People-centric governance is our policy’ – Governor Shiv Pratap Shukla

‘విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరింది. క్యూర్‌, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందిని అంచనా.

జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లగా విభజించాం. హైదరాబాద్‌ మెట్రోపాలిటిన్‌ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం. హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం. హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ప్రపంచానికి తెలంగాణ దిక్సూచిగా మారబోతుంది.’ అని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.