📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Pensions: తెలంగాణలో పింఛన్ల పెంపుపై కీలక అప్‌డేట్

Author Icon By Saritha
Updated: February 26, 2026 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Pensions: తెలంగాణ రాష్ట్రంలోని చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక పరిస్థితులను బట్టి పింఛన్ల మొత్తాన్ని పెంచాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రారంభించింది.

Read Also: Senior Sweeper Salary: తెలంగాణలో స్వీపర్ జీతం రూ. 2 లక్షలు

Telangana Pensions: Key update on pension hike in Telangana

విడతల వారీగా పింఛన్ల పెంపు

ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు ₹2,016 అందజేస్తుండగా, దివ్యాంగులకు ₹4,016 చొప్పున పింఛన్ అందుతోంది. తాజా ప్రతిపాదన ప్రకారం, ప్రాథమికంగా అందరికీ ₹500 చొప్పున పెంచాలని ప్రభుత్వం (Government) భావిస్తోంది. ప్రస్తుతం పింఛన్ల కోసం ప్రతి నెలా సుమారు ₹950 కోట్లు ఖర్చవుతుండగా, ఈ ₹500 పెంపు వల్ల ఏడాదికి అదనంగా ₹2,500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల హామీ మేరకు పింఛన్లను భారీగా పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ పెంపును చేపట్టనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సాధారణ పింఛన్లను ₹4,000లకు, దివ్యాంగుల పింఛన్లను ₹6,000లకు పెంచాలని యోచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cheyutha Pension Update Pension Increase 500 Rupees Telangana Pension Hike TG Government Schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.