📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telangana Pensions: ఇకపై ఫేస్ రికగ్నిషన్ తో పింఛన్ తీసుకోవచ్చు

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలో ఆసరా పథకంలో భాగంగా అర్హులైన వారికి పింఛన్లు (Pensions) అందిస్తోంది ప్రభుత్వం. అయితే వీటిలో కొంత మందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు వారికి నేరుగా వేలిముద్రలు తీసుకొని పింఛనులు పంపిణీ చేస్తున్నారు. ఒక వేళ వేలి ముద్ర పడకపోతే ఆ నెల పింఛన్ ఆగినట్లే. ఇలా దీనిలో వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక సమస్య లేకుండా పరిష్కారం తీసుకొచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు పింఛన్లు (Telangana Pensions) అందిస్తోంది.

ఇకపై సులభంగా పింఛన్లు తీసుకోవచ్చు

అయితే ఈ పంపిణీలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు లేని వారికి వేలిముద్రల ద్వారా పింఛన్లు (Telangana Pensions) ఇస్తున్నారు. కానీ వృద్ధుల వేలిముద్రలు నుంచి సరిగా పడకపోతే ఆ నెల పింఛన్ ఆగిపోయేది. ఇది వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించేది. అంతేకాకుండా మరణించిన లబ్దిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్లు స్వాహా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ (Face recognition) ఆధారిత వ్యవస్థను అమలు చేయనుంది. దీని కోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా పింఛన్ ఇచ్చే సమయంలో వేలిముద్రతో పనిలేకుండానే లబ్ధిదారుని ముఖాన్ని గుర్తించి పింఛన్ పంపిణీ చేస్తుంది. ఇది వేలిముద్రలు పడని వృద్ధులకు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ నూతన విధానం అమలు కోసం పుర కమిషనర్లు, బిల్ కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, తపాలా శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

పింఛన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి దుర్వి నియోగాన్ని అరికట్టడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మరణించిన పెన్షన్ దారుల స్థానంలో వారి భార్యలకు అర్హత ఉంటే అవకాశం కల్పించడం. వలస వెళ్లి మూడు నెలలుగా పింఛన్ తీసుకోని, లేదా మృతిచెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించడం. సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన పింఛన్లను పరిష్కరించడం. రెగ్యులర్ పెన్షన్ దారుల వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం. పురపాలికల్లో ఏడాదికి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పింఛన్ తీసుకోని లబ్దిదారులను గుర్తించడం. కొత్తగా అర్హులైన వారి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి, ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు ఉన్నాయి. ఈ నూతన వ్యవస్థ ద్వారా ఆసరా పింఛన్ల పంపిణీ మరింత వేగవంతంగా. సురక్షితంగా, పారదర్శకంగా జరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఇది లబ్ధిదారులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ పింఛన్లను పొందేలా చేస్తుంది. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: TG EAPCET: ఎప్ సెట్లో 77,561 సీట్లు భర్తీ5493 సీట్లు ఖాళీ

Breaking News facial recognition pension finger print latest news pensions telangana government TG pensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.