Telangana Oil Fed: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఈ నెల 22న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రెండు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. ఈ మిల్లుల సమిష్టి సామర్థ్యం గంటకు 120 మెట్రిక్ టన్నులుగా ఉందని చెప్పారు. ఈ విషయమై మంగళవారం సచివాలయంలో వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read Also: Gas Shortage : ఏపీలో గ్యాస్ కొరత పై మంత్రి కీలక ప్రకటన
రూ.300 కోట్లతో ఆధునిక ఫ్యా:క్టరీ
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామం లో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిందని తెలిపా రు. ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించ్కారు. ప్రారంభ దశలో నర్మెట్ట యూనిట్ గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుండగా భవిష్యత్తులో దీనిని గంటకు 120 టన్నుల వరకు విస్తరించే విధంగా రూపకల్పన చేసినట్లు చెప్పారు. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఆయిల్ పామ్ రైతులకు ఎంతో మద్దతుగా నిలవనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన యంత్రాలు, ఆయిల్ పామ్ సాగు విధానాలు, ఉత్పత్తి పెంపు మార్గాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యక్షంగా సమాచారం అందించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లో 13వ ఆసియన్ టెక్స్ టైల్ కాన్ఫరెన్స్…
ప్రపంచ స్థాయి టెక్స్ టైల్ రంగంలో తెలంగాణను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష ప్రమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో ఎప్రిల్ 2, 3 తేదీల్లో జరగను న్నరి ఇమాజినింగ్ ది ఫ్యూచర్ గ్లోబల్ టెక్స్టైల్స్ సదస్సు బ్రోచర్ను మంగళవారం సచివాలయంలో వారు విడుదల చేశారు. ఈ సదస్సు నిర్వహణ ద్వారా దేశీయ, అంతర్జాతీయ టెక్స్టైల్ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడ దారులు, నిపుణులు ఒకే వేదికపైకి రావడం ద్వారా తెలంగాణాలో టెక్స్టైల్ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ
ఈ అంతర్జాతీయ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం, కాన్సిడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రి (సిఐటిఐ) భాగస్వామ్యంతో హైదరా బాద్ లోని ఇంటర్నెషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సు ద్వారా తెలంగాణను టెక్స్టైల్, అపారెల్, ఫుట్వెర్ తయారికి అంతర్జాతీయల పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్లు వివరించారు. సమావేశంలో టెక్స్టైల్ రంగంలో సస్టైన బులిటి, సాంకేతికత, సరఫరా వ్యవస్థల అభివృద్ధి, గ్లోబల్ మార్కెట్ల అవశాలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నా యన్నారు. సదస్సుకు అనుబంధంగా ఏప్రిల్ 4న వరంగల్. లోని పిఎం మిత్ర పార్కుకు పరిశ్రమల సందర్శన కూడా నిర్వహించనున్నారు. యాసంగి పంటలు కొనుగోలుకు కేంద్ర మంత్రికి వినతి. యాసంగ్ (రబీ) 2025-26 సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో పండిన మినుములు, వేరుశెనగ, పొద్దు తిరుగుడు, శెనగ పంటలను కనీస మద్దతు ధరనఎ కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే అనుమతించాలని కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పంటల కోతలు ఆరంభమైనందున వంటలను వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: