📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telangana: బిర్యానీతో న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. ప్రభుత్వ పాఠశాలల్లో

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) ప్రభుత్వం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించనుందని ప్రకటించింది. ఈ పథకానికి సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం పోషకాహారం అందించడమే కాక, పాఠశాల హాజరుశాతాన్ని పెంచడంలో ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

2026–27 నుంచి స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పూర్తి స్థాయిలో అమలు

2026–27 విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లలో ఈ అల్పాహార పథకాన్ని(Breakfast plan) పూర్తిగా అమలు చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 1.7 లక్షల ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఇంటర్ బోర్డు ప్లాన్ చేస్తున్నారు. యూనిఫార్మ్‌లను కూడా అందించాలనే ఆలోచనలు కొనసాగుతున్నాయి.

అల్పాహారం పథకం ప్రారంభం

అల్పాహారం పథకం కింద, వారంలో మూడు రోజులు అన్నంతో తయారైన పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ వంటకాలతో భోజనం, రెండు రోజులు ఉప్మా వంటి ఇతర స్నాక్స్ అందించాలనే ప్రణాళిక ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 17 లక్షల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతున్నందున, ఇప్పుడు టిఫిన్ జోడించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది సుదూర ప్రాంతాల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇకపై రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను (KGBV) ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణలో మొత్తం 495 KGBVలు ఉన్నాయి, 2025–26 విద్యా సంవత్సరంలో సుమారు 120 KGBVలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థినులు 10వ తరగతి తర్వాత కూడా చదువును కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

government schools Midday Meal School Breakfast Scheme student welfare telangana government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.