Telangana: కొత్తగా యూరియా కార్డు

Read Time:  1 min
Telangana: కొత్తగా యూరియా కార్డు
FONT SIZE
GET APP

యాప్ కు ప్రత్యామ్నాయ చర్యలు

హైదరాబాద్ : (Telangana) యూరియా సరఫరా విషయంలో వ్యవసాయ శాఖ మరో కొత్త విధానాన్ని తెరముందుకు తెస్తోంది. యూరియా కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, దాంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో దానికి ప్రత్యమ్నాయంగా మరో కొత్త పద్దతిని తీసుకొస్తోంది. కొత్తగా పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం ద్వారా యూరియా అందచేయాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ కార్డు ఉంటేనే రైతులకు యూరియాను అందచేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Read also: TG: ఎస్ఐఆర్ పై అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి డైలాగ్ వార్

Telangana: కొత్తగా యూరియా కార్డు
Telangana New urea card

సిద్దిపేట్‌లో పైలట్ ప్రాజెక్టుగా యూరియా కార్డుల పంపిణీ

ఈ నేపధ్యం లోనే రాష్ట్రంలోని సిద్దిపేట్ జిల్లాను (Siddipet District) పైలట్ ప్రాజెక్టుగా చేసుకుని యూరియా కార్డులను రైతులకు పంపిణీ చేస్తున్నారు. (Telangana) జిల్లాలోని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు యూరియా కార్డులు ఇస్తున్నారు. ఈ కార్డుతో పాటు, పాస్ పుస్తకం, ఆ ధార్ కార్డు తీసుకొచ్చినట్లయితేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు యూరియా కార్డుల కోసం రైతులు అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ప్రతీ క్లస్టర్ వద్ద బారులు తీరుతూ యూరియా కార్డుల కోసం పడిగాపులు పడుతున్నారు. రైతుల పేరు, ఫోన్ నెంబరు, ఊరు పేరు, ఆధార్, పట్టాదార్ పాస్పుస్తకం నెంబరు, సాగు విస్తీర్ణం తదితర వివరాలను తీసుకుని, వాటి ప్రకారం సంబంధిత రైతుకు ఏ మేరకు యూరియా ఇవ్వాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ఒకసారి యూరియా తీసుకుంటే మళ్లీ పదిహేను, ఇరవై రోజుల తర్వాతే రెండోసారి తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.