📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం

Author Icon By Saritha
Updated: February 13, 2026 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.1056 కోట్లతో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు

హైదరాబాద్ : (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 15 రోజుల్లో నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగులు, ప్రభుత్వం (Government) కలిసి రూ. 1056 కోట్లతో ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి ఏడాదికి రూ.528 కోట్లను సేకరించనుండగా ప్రభుత్వం మరో రూ.528 కోట్లను ఇవ్వనుంది. ఈ మొత్తంలో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులుగా కొనసాగనుండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని సీఈవోగా నియమిసానతరు. గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెరామకృష్ణారావు సమావేశం నిర్వహించారు.

Read Also: Telangana: కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి భారీ ఆరోగ్య భద్రత

New health scheme for government employees and pensioners

రెండు వారాల్లో పథకం ప్రారంభం

సమావేశంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకంపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలను త్వరలోనే రూపొందించనున్నారు. (Telangana) మరో పదిహేను రోజుల్లో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని సచివాలయంలో జరిగిన ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సి.వీ ఆనంద్, మహేశ్ దత్ ఎక్కా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోగులతోపాటు పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్కు ఉద్యోగుల తరపున తమ బేసిక్ సాలరీలో 1.5 శాతం మొత్తాన్ని ఇవ్వనుండగా.. ప్రభుత్వం తరపున కూడా 1.5 శాతం కేటాయించాలన్న ప్రతిపాదనను సమావేశంలో అంగీకరించారు.

మెరుగైన వైద్య సదుపాయాలే ప్రభుత్వ లక్ష్యం

హెల్త్ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేసి, ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంతి, ఉప ముఖ్యమంత్రిలచే ప్రకటింపచేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు. రాష్ట్రంలో లక్షా 44 వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లలో నాలుగవ తమ బేసిక్ పేలో 1.5శాతం మొత్తాన్ని చెల్లిస్తే తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు సంవత్సరానికి రూ.528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని పేర్కొన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుండి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుండి ఇద్దరు సభ్యులుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనుండి ఒకరిని ట్రస్టు సీఈవోగా నియమిస్తారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సీఎస్ తెలిపారు. రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు.

ఉద్యోగ సంఘాల నాయకులు

ఈ సమావేశంలో టిఎన్జివో సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిజివో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, తెలంగాణ సెక్రెటేరియేట్ అసోసియేషన్ అధ్యక్షులు జి. శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దేవేందర్, పీఆర్టీయూ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, తెలంగాణా యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ఎస్టియు టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షులు లక్షయ్య, మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన నాగాంబ, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దాస్య నాయక్, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు మోహన్ నారాయణ, కార్యదర్శి నర్స రాజు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Employees Health Care Trust Government Employees hyderabad Latest News in Telugu New Health Scheme pensioners telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.