Telangana new governor: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ఆయనతో ఈ ప్రమాణ స్వీకారం చేయించారు.
Read Also :TG Tourism Development: పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బాధ్యతల స్వీకారం
ఈ అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో రాజ్ భవన్ మరియు ప్రభుత్వం మధ్య సమన్వయం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :