Telangana new government whips: ఐదుగురు ప్రభుత్వ విప్ ల నియామకం

Read Time:  1 min
Telangana new government whips: ఐదుగురు ప్రభుత్వ విప్ లనియామకం
Telangana new government whips: ఐదుగురు ప్రభుత్వ విప్ లనియామకం
FONT SIZE
GET APP

Telangana new government whips: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్లుగా రేవంత్రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్ ఎమ్మెల్యే), విజయ రమణా రావు (పెద్దపల్లి ఎమ్మెల్యే), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్నగర్ ఎమ్మెల్యే) ఉన్నారు.

Read Also : Anakapalli crime: మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులోకి నిందితుడు

శాసనమండలిలో ప్రభుత్వ పక్షాన సభ్యులను సమన్వయం చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వారిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఉన్నారు. సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు సభ్యులందరూ హాజర య్యేలా చూడటం వీరి ప్రధాన విధి. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరూ వెళ్లకుండా విప్ జారీ చేసే అధికారం వీరికి ఉంటుంది. ఈ నియామకాలతో ప్రతి పక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కో వడంలో ఈ ఐదుగురు నేతలు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే శాసన సభలో ముగ్గురు విప్లు ఉన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా పట్నం మహేందర్రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ విప్లు వచ్చారు. దీంతో మండలిలో విప్ల సంఖ్య ముగ్గురికి చేరింది. 2023 డిసెంబర్ లో ఎమ్మెల్యేల నుంచి నలుగురు ప్రభుత్వ విప్ల నియామకం చేశారు. ధర్మపురి(ఎస్సీ) ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ గా నియామకం అయినప్పటికీ 8 నెలల క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రస్తుతం పాతవారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డోర్నకల్ (ఎస్టీ) ప్రభుత్వ విప్లుగా కొనసాగుతున్నారు. కొత్తగా వచ్చిన ముగ్గురు విప్లతో కలిపి ఆరుగురు ప్రభుత్వ విప్లు అసెంబ్లీలో ఉంటారు. అయితే అసెంబ్లీలో చీఫ్ విప్ను ఇంతవరకు నియామకం చేయలేదు. ప్రభుత్వ చీఫ్ విప్ పోస్ట్ కోసం వరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించగా ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఆయన ఒప్పుకోని పక్షంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పేరును పరిశీలించే అవకాశం ఉందని సమా చారం. వారిద్దరిలో ఒకరికి ఆర్టీసి చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లేదా ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఆర్టీసి చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Telangana new government whips: Five government whips appointed
Telangana new government whips: Five government whips appointed

14జిల్లాలకు డిసిసి కమిటీలను నియమించిన పిసిసి

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విస్తరణ కోసం ఉగాది పండుగ రోజున 14 జిల్లా కాంగ్రెస్లకు పూర్తిస్థాయిలో కార్యవర్గం ఏర్పాటు చేసింది. టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ ఆయా జిల్లాల భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాల ప్రాతిపదికన కార్యవర్గంలో వైస్ ప్రసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, వాచకప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల సంఖ్యను నిర్ధారించి ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కార్యవర్గం 89 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో 12 మంది ఉపాధ్యక్షులు 24 మంది ప్రధానకార్యదర్శులు, వాచకప్రతినిధులు, 48 కార్యదర్శులు నియమించారు. ఆరుగురు ఖైరతరాబాద్ జిల్లా కార్యవర్గం 90 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో 10మంది ఉపాధ్యక్షులు 26మంది ప్రధానకార్యదర్శులు, 41 కార్యదర్శులు, 13మంది కార్యవర్గసభ్యులను నియమిం చారు.

ఈ జిల్లాలో వాచకప్రతినిధులను కోశాధికారిని నియమించలేదు. నాగర్కర్నూల్ జిల్లా కార్యవర్గం 32 మందితో ఏర్పాటు ఉపాధ్యక్షులు ప్రధానకార్యదర్శులుపన్నెండు మంది. ట్రెజర్, నలుగురు వాచకప్రతినిధులు, తొమ్మిది మంది కార్యదర్శులతో జిల్లా కాంగ్రెస్ కమిటీకి రూపం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కార్యవర్గం 58 మందితో ఏర్పాటు చేశారు. ఆరుగురు. ఉపాధ్యక్షులు పన్నెండు మంది ప్రధానకార్యదర్శులు, ట్రెజర్, నలుగురు వాచకప్రతినిధులు, 16కార్యదర్శులు, 19 కార్యవర్గ సభ్యులు నియమించారు. మెదక్ జిల్లా కార్యవర్గం 61 మందితో ఏర్పాటు చేశారు. 14మంది ఉపాధ్యక్షులు 20మంది ప్రధానకార్యదర్శులు, ట్రెజర్, ఆరుగురు వాచకప్రతినిధులు, 20 కార్యదర్శులనునియ మించారు. నిర్మల్ జిల్లా కార్యవర్గం 65 మందితో ఏర్పాటు చేయగా అందులో ఆరుగురు ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది ప్రధానకార్యదర్శులు, నలుగురు వాచకప్రతినిధులు, 28 కార్యదర్శులు, 19 కార్యవర్గ సభ్యులతో జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంస్థాగత పునాది ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 11 మంది ఉపాధ్యక్షులు 22 మంది ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, ఐదుగురు వాచకప్రతినిధులు, 26 మంది కార్యదర్శులు, 15మంది కార్యవర్గసభ్యులను నియమిస్తూ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు.

కామారెడ్డి జిల్లా కార్యవర్గం 84 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది ఉపాధ్యక్షులు 32మంది ప్రధానకార్యదర్శులు, ట్రెజర్, నలుగురు. వాచకప్రతినిధులు, 30 కార్యదర్శులు నియమించారు. మంచిర్యాల జిల్లా కార్యవర్గంలో మొత్తం 50 మంది ఉండగా ఏడుగురు ఉపాధ్యక్షులు 14మంది ప్రధానకార్యదర్శులు, ట్రెజర్, ముగ్గురు వాచకప్రతినిధులు, 25 కార్యదర్శులు నియమించారు. ఆదిలాబాద్ 61 మందితో జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయగా ఆరుగురుని ఉపాధ్యక్షులుగా, 20మంది ప్రధానకార్యదర్శులు, ట్రెజర్, ముగ్గురు వాచకప్రతినిధులు, 31 కార్యదర్శులు నియమించారు. వనపర్తి జిల్లా కార్యవర్గం 32 మందితో ఏర్పాటు చేయగా ఇద్దరు ఉపాధ్యక్షులు ఆరుగురు ప్రధానకార్యదర్శులు, నలుగురు వాచకప్రతినిధులు, 16 కార్యదర్శులు నలుగురు. కార్యవర్గసభ్యులను నియమించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గం 54 మందితో ఏర్పాటు చేయగా అందులో ఆరుగురు ఉపాధ్యక్షులు, పది మంది ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, ఇద్దరు ప్రతినిధులు, 16 కార్యదర్శులు, 19 మంది కార్యవర్గ సభ్యులతో జిల్లా కాంగ్రెస్కమిటినీ రూపొందించారు.

నిజామాబాద్ నగర పార్టీ కార్యవర్గం 33 మందితో ఏర్పాటు చేయగా ఇందులో ముగ్గురు ఉపాధ్యక్షులు ఏడుగురు ప్రధానకార్యదర్శులు, ట్రెజర్, ఇద్దరు వాచకప్రతినిధులు, పదహారుమంది కార్యదర్శులు, ఆరుగురు కార్యవర్గసభ్యులను నియమించారు. యాదాద్రి జిల్లా కార్యవర్గం 66 మందితో ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు ఉపాధ్యక్షులు 12మంది ప్రధానకార్యదర్శులు, వాచకప్రతినిధి ఒకరు, 29 కార్యదర్శులు, 17 మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. ప్రజాస్వామ్య పునాదులపై పటిష్టమైన నిర్మాణంతో గత 140 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తున్న అ ఖిల భారత కాంగ్రెస్ పార్టీ లో సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగం గా అత్యంత కీలకమైన డిసిసి కార్యవర్గంలో మీకు భాగస్వామ్యం లభించినందుకు మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాననీ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.