తెలంగాణ (Telangana) ప్రభుత్వం, రేషన్ లబ్ధిదారుల కోసం ‘T-రేషన్’ యాప్ తీసుకొచ్చింది. కార్డు యాక్టీవ్‌లో ఉందా? ఆధార్‌తో లింక్ అయిందా? మీ రేషన్ డీలర్, షాప్ నంబర్, లొకేషన్, రేషన్ కోటా, ఇప్పటివరకు ఎంత అందుకున్నారు వంటి వివరాలు ఈ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. వివరాలన్నీ తెలుగులో అందుబాటులో ఉంటాయి.కాగా ప్రభుత్వం ఇటీవల మీసేవా వాట్సాప్, యూరియా యాప్‌నూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Read Also: Sajjanar: WhatsApp వినియోగదారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్
‘T-రేషన్’ యాప్ ఎలా డౌన్లొడ్ చేసుకోవాలంటే?
మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి. ‘T-Ration Telangana’ (Telangana) అని సెర్చ్ చేయండి. అధికారిక యాప్‌ను ఎంచుకోండి. ఇన్‌స్టాల్ బటన్‌పై క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఉపయోగించడం ప్రారంభించండి. T-Ration App ఓపెన్ చేయండి. భాషను ఎంచుకోండి (తెలుగు / English). ఆ తర్వాత మీ రేషన్ కార్డు నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయండి. అవసరమైతే OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి. మీ రేషన్ వివరాలు, నెలవారీ సరుకులు, ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: