హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఐపి)ని అమలు చేయాలని తెలంగాణ (Telangana) ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించాలని నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. 2025-28 సంవత్సరాలకు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం ఆదివారం అబిడ్స్ లోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఈ సమావేశంలో 2025-28 సంవత్సరాల కాల పరిధికి తపస్ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా వోడ్నాల రాజశేఖర్ (జగిత్యాల), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెల్కల పల్లి పెంటయ్య (యాదాద్రి)లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించినట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం(Education Policy) అమలుపరచాలని, పెండింగ్లో ఉన్న పిఆర్సి డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి కమిటీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు పరచాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. అలాగే విద్యారంగంలోని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు.
సమావేశంలో ఏబిఆర్ఎస్ఈ్యం జాతీయ సంఘటన మంత్రి మహేంద్ర కపూర్, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్, పూర్వ తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంత్ రావు, నవాత్ సురేషపాల్గొనగా.. ఎన్నికల అధికారులుగా పాలేటి వెంకట్ రావు, అయిలినేనినరేందర్ రావు వ్యవహారించారని తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: