కాంగ్రెస్ ఖాతాలో 12.. బిఆర్ఎస్కు రెండు
Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. అధికంగా కాంగ్రెస్ ఖతాలోకి ఏకగ్రీవ వార్డులు చేరాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్లగొండలోని సూర్యపేటలో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. వివరాల ప్రకారం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు(Congress candidates) 12 చోట్ల ఏకగ్రీవం కాగా, బిఆర్ఎస్ నుంచి రెండు వార్డుల్లో ఏకగ్రీవ విజయం అందుకు న్నారు. సూర్యపేట జిల్లాల్లో అత్యధిక ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి.
Read Also: BC Commission :కులాల వారీగా విద్యార్థుల సమాచారం ఇవ్వండి
కోదాడలో మూడు వార్డులు ఏకగ్రీవం కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఏకగ్రీవ ఫలితాలు, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బిఆర్ఎస్కు చెరో విజయం దక్కింది. అలాగే, మహబూబ్నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహిళా అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఏకగ్రీవ విజయం అందుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ వార్డు-10(ఎస్టీ జనరల్)లో పి. విక్రమ్(బిఆర్ఎస్) ఏకగ్రీవ గెలుపు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలికి వార్డు-17 (ఎస్సీ మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ వార్డు-15 (అన్ రిజర్వ్ మహిళ)లో తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక.
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ వార్డు-10 (బీసీ మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ వార్డు-3 (బీసీ మహిళ)లో సులావ నాగలక్షి ్మ (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు-11 (యుఆర్ మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు-21 (బీసీ మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు, సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు-31 (యుఆర్ మహిళ)లో యెర్సీని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు-58 (యుఆర్ మహిళ)లో బి. రమాదేవి (కాంగ్రెస్) ఎన్నిక.
మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు
మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు-32 (యుఆర్ మహిళ)లో గోడల మానస (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు1 (యుఆర్ మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయం. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు -1 (యుఆర్ జనరల్)లో అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నిక. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు-15 (ఎస్సి జనరల్)లో పి.విజయలక్షి ్మ (బిఆర్ఎస్) ఏకగ్రీవ ఎన్నిక. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు-10 (బీసి మహిళ)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: