📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

Telangana municipal elections : ఎన్నికల కోడ్ అమల్లోకి! తెలంగాణలో కొత్త రూల్స్ ఏంటి?

Author Icon By Sai Kiran
Updated: January 27, 2026 • 9:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana municipal elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు, నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహించనున్నట్లు కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, అవసరమైతే ఫిబ్రవరి 12న రీ–పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి.

Read Also: Budget 2026: బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!

Telangana municipal elections

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలంతా తప్పకుండా (Telangana municipal elections) ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసుల నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

నగదు రవాణాపై కూడా కఠిన నియమాలు అమలు చేస్తున్నట్లు ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. వ్యక్తులు గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. అంతకంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుందని, లేనిపక్షంలో నగదును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. సీజ్ చేసిన సందర్భాల్లో పోలీసుల నుంచి రిసీప్ట్ ఇస్తారని, దాని ఆధారంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu cash limit elections India election code Telangana Election Commission Telangana election rules cash seizure Google News in Telugu Latest News in Telugu model code of conduct Telangana municipal polls Telangana polling date Telangana Telangana election schedule Telangana Municipal Elections Telangana voters count Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.