Telangana Municipal Elections 2026: భారీ పోలీసు బందోబస్తు

Read Time:  1 min
Assembly elections 2026
Assembly elections 2026
FONT SIZE
GET APP

Telangana Municipal Elections 2026 : రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేబట్టింది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు నేరుగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించగా సోమవారం నాడు మరోసారి క్షేత్రస్థాయి అధికారులకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లతో పాటు 116 మున్సిపాలిటీలకు బుధవారం నాడు ఎన్నికలు జరగనుండగా ఇవన్నీ గ్రేటర్ పరిధిలో లేని జిల్లాలే కావడం గమనార్హం. ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు పోలవకుండా చూడాలని క్షేత్రస్థాయి అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

Telangana Municipal Elections 2026: Heavy police deployment
Telangana Municipal Elections 2026: Heavy police deployment

పోలీసు స్టేషన్లలో సరెండర్ చేయని వారిపై చర్యలు

ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని, ఓటర్ల నుంచి, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వారు ఆదేశించారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎన్నికల విధులను కఠినంగా నిర్వహించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వుండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాలని, ఎక్కడా మద్యం పంపిణీ జరగకుండా చూడాలని, అక్రమ ఆయుధాలపై కఠినంగా వుండాలని, లైసెన్స్ ఆయుధాలను పోలీసు స్టేషన్లలో సరెండర్ చేయని వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

పోలింగ్ తరువాత బ్యాలెట్ పత్రాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించే క్రమంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, ఈ నెల 13వ తేదీన కౌంటింగ్ వుండడంతో అప్పటి వరకు బందోబస్తు వుండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పోలింగ్ జరిగే సమయంలో రాజకీయ నాయకులు పరిమితికి మించి వాహనాలను వాడితే వెంటనే జప్తు చేయాలని, కౌంటింగ్ జరిగే కేంద్రాల వద్ద కూడా ఆయా పార్టీల నాయకుల హడావిడి, హంగామా లేకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారు బాణాసంచా కాల్చడం వంటివి చేయకుండా చూడాలని, సమస్యాత్మక గ్రామాలలో ఫలితాల తరువాత ఎలాంటి రాజకీయ గొడవలు లేకుండా ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలావుండగా ఎన్నికలు జరిగే ప్రాంతాలలో మంగళ, బుధవారాల్లో కల్లు దుకాణాలు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూస వేయాలని పోలీసు, అబా ్కరీ అధికారులు ఆదేశించారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఒకవేళ మిలటరీ క్యాన్టీలు వుంటే వాటిని కూడా మూసి వేయాలని ఆదేశించారు. కౌంటింగ్ జరిగే 13వ తేదీన కూడా వీటిని మూసివేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.