📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Telangana: నేడు రాష్ట్రవ్యాప్తంగా వరదలు, ప్రమాదాలపై మాక్ ఎక్సర్ సైజ్

Author Icon By Tejaswini Y
Updated: December 22, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై ప్రభుత్వం, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనుంది. ఈ మాక్ ఎక్సర్సైజ్ కోసం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్లు(District Collectors), జిల్లాలోని అన్ని సంబంధిత శాఖల అధికారులు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తారు. డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఒకేసారి అన్ని జిల్లాల్లో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించి, వ్యవస్థల సామర్థం, సమన్వయాన్ని పరీక్షించనున్నారు.

Read Also: Bollaram: హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

వరదల మాక్ ఎక్సర్సైజ్కు ఎంపికైన ప్రదేశాలు

1. ఖమ్మం జిల్లా, మున్నేరు నది ఒడ్డున ఉన్న బొక్కలగడ్డ, ఖమ్మం పట్టణ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పరిసర ప్రాంతం.

2. వరంగల్ జిల్లా, రెడ్డిపురం / చిన్న వడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతం.

3. కామారెడ్డి జిల్లా, పెద్ద చెరువు, జీఆర్ కాలనీ ప్రాంతం.

4. నిజామాబాద్ జిల్లా, రఘునాథ చెరువు, కిల్లా రామాలయం సమీప ప్రాంతం.

5. మెదక్ జిల్లా, హవేలీ ఘన్పూర్ మండలం, బుర్గుపల్లి గ్రామం, దూప్ సింగ్ తండా ప్రాంతం.

6. మహబూబ్‌నగర్ జిల్లా, కృష్ణసాగర్ (కొత్త చెరువు), రామయ్య బావి మోడెం కుంట (యెన్నుగొండ), దివిటిపల్లి (అమరరాజా ఇండస్ట్రీ సమీపం), ఏరియా హాస్పిటల్, జడ్చర్ల.

7. హైదరాబాద్ జిల్లా, నెక్లెస్ రోడ్, వ్యూ పాయింట్ ప్రాంతం.

8. సూర్యాపేట జిల్లా, పెద్ద చెరువు, కోదాడ ప్రాంతం.

9. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు గ్రామం, గోదావరి నది, భద్రాచలం పరిసర ప్రాంతం.

10. నిర్మల్ జిల్లా, చిత్యాల వాగు పరిసర ప్రాంతం.

11. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి వాగు పరిసర ప్రాంతం.

12. హనుమకొండ జిల్లా, రెడ్డిపురం చెరువు, సమ్మయ్య నగర్ పరిసర ప్రాంతం.

Telangana: Mock exercise on floods and accidents across the state today

ప్రమాదాల మాక్ ఎక్సర్సైజ్కు ఎంపికైన ప్రదేశాలు

1. సంగారెడ్డి జిల్లా ఔరోబిందో ఫార్మా లిమిటెడ్, బోరపట్ల, హత్నూర మండలం వినియోగించే రసాయనాలు: మెథనాల్, నాఫ్తలీన్, ఎథనాల్, ఎథైల్ అసిటేట్, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్

2. మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ స్మార్ట్ టెర్మినల్, ఐడీఏ ఫేజ్-3, చెర్లపల్లి ఇంధనాలు: మోటార్ స్పిరిట్, హెచ్ఎస్, ఏటీఎఫ్, ఎథనాల్, బయోడీజిల్

3.రంగారెడ్డి జిల్లానాట్కో ఫార్మా లిమిటెడ్, కెమికల్ డివిజన్, మెకగూడ, నందిగారసాయనాలు: అసిటోన్, మెథనాల్, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్, మెథైల్ క్లోరైడ్, టోల్యూన్, హెక్సేన్, సైక్లో హెక్సేన్, ఎథైల్ అసిటేట్, హెచ్సీఎల్ గ్యాస్, సల్ఫ్యూరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, నైట్రిక్ యాసిడ్

4. యాదాద్రి భువనగిరి జిల్లా డివిస్ ల్యాబొ రేటరీస్, లింగోజిగూడెం, టోల్యూన్, మెథనాల్, ఆర్థో జైలిన్, క్లోరిన్, అమోనియా5. నల్గొండ జిల్లారెడ్డి ల్యాబ్స్, మిర్యాలగూరసాయనాలు: మెథాక్సీ డైబెన్జో అజెపిన్, సోడియం స్టియరిల్ ఫ్యూమరేట్, ఆక్స్కార్బాజెపిన్, ఇస్ట్రాడెఫైలిన్

మాక్ ఎక్సర్సైజ్ సమయంలో ఎన్డీఎంఏ(NDMA) నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలకులు లోపాలు, బలహీనతలు, సమన్వయ లోపాలను గమనించి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఉదయం 09:00 గంటల నుంచి 13:00 గంటల వరకు వరదల సన్నివేశం, రాత్రి వేళ సాయంత్రం 17:30 గంటల నుంచి 21:00 గంటల వరకు పారిశ్రామిక ప్రమాదాల సన్నివేశం ఎంపిక చేసిన పై జిల్లాలు, ప్రదేశాల్లో ఈ మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

disaster preparedness Flood Mock Drill Industrial Accident Mock Drill Mock Exercise NDMA Telangana Disaster Management

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.