📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana: ఎర్రశేఖర్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: October 13, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జడ్చర్ల: జడ్చర్ల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారంపై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు. ఎర్రశేఖర్ ఎమ్మెల్యే పదవి కోసం తనను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Mahaboobnagar: హాస్టల్ నచ్చలేదని గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

ఫ్యాక్షన్ రాజకీయాలు’ ఆరోపణలు

గతంలో తన సొంత తమ్ముడిని సర్పంచ్ పదవి కోసం ఎర్రశేఖర్ హత్య చేయించారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. “అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే పదవి కోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడడు. ఆయన నుంచి రక్షణ కోసం నేను జెడ్ కేటగిరీ భద్రత కోరాలా?” అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇప్పటివరకు జడ్చర్లలో ప్రశాంత రాజకీయ వాతావరణం ఉందని, ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ చేరికపై స్పష్టత

ఎర్రశేఖర్(Errasekhar) కాంగ్రెస్‍లో చేరడాన్ని ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాకు చెందిన ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంగీకరించరని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. “ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నించిన వారిని తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారు? అలాంటి వారికి కనీసం గేటు దగ్గర అపాయింట్‍మెంట్ కూడా దొరకదు” అని అన్నారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే ఎర్రశేఖర్ ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీఎం వైఖరిపై ధీమా

పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి చేర్చుకునే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారని అనిరుధ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎర్రశేఖర్ గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‍లో చేరిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎవరిపై హత్యాయత్నం ఆరోపణలు చేశారు?

మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌పై ఆయన హత్యాయత్నం ఆరోపణలు చేశారు.

ఎర్రశేఖర్ కాంగ్రెస్‍లో చేరడంపై అనిరుధ్ రెడ్డి అభిప్రాయం ఏమిటి?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆయన చేరికను అంగీకరించరని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anirudh Reddy brs congress party Erra Sekhar Google News in Telugu Jadcherla politics Latest News in Telugu political controversy. Telangana politics Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.