తెలంగాణ (Telangana) ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.గత పదేళ్లలో స్వార్థపూరిత నిర్ణయాల వల్ల చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంస్కరిస్తున్నామని వెల్లడించారు.
Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?
‘మినీ మ్యారేజ్ హాల్’ ఏర్పాటు
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ప్రైవేటు నిర్మాణ సంస్థల సహకారంతో వీటిని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నామన్నారు. సుమారు 3 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కార్యాలయాల్లో కేవలం రిజిస్ట్రేషన్లే కాకుండా, ప్రజల సౌకర్యార్థం అనేక ప్రత్యేక వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సమీకృత భవనాల్లో కేవలం ఆఫీసులే కాకుండా సామాజిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు పొంగులేటి వివరించారు.
వివాహ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ‘మినీ మ్యారేజ్ హాల్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతల కోసం ఫీడింగ్ రూమ్స్, చిన్న పిల్లల కోసం క్రెచ్ సదుపాయం, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌకర్యం, విశాలమైన వెయిటింగ్ ఏరియాలు. ఈ భవనాల నిర్మాణంతో పాటు ఐదేళ్ల నిర్వహణ బాధ్యతను కూడా సంబంధిత నిర్మాణ సంస్థలే చూసుకుంటాయని మంత్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: