📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు

Author Icon By Saritha
Updated: October 10, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

5 జిల్లాల్లో గ్రానైట్, సున్నపురాయి తవ్వకాలకు సర్కార్కు ప్రతిపాదనలు

హైదరాబాద్ : ఇసుకతో పాటు,ఇతర మినరల్స్(Minerals)తవ్వకాలను చేపట్టేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఒక్క ఇసుక విక్రయాలు మాత్రమే నిర్వహిస్తుండా, మిగిలిన ఖనిజాలను టెండర్ల పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపులు చేస్తోంది. అయితే అనుమతి పొంది సంబంధిత ఖనిజ(telangana)తవ్వకాలను చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నట్లు సంస్థ గుర్తించింది. దీంతో ఇసుకతో పాటు, ఇతర ఖనిజాలను కూడా సంస్థ ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో ఇసుకుతో పాటు, డోలమైట్, గ్రానైట్, సున్నపురాయి, మార్బుల్, మైకా తదితర ఖనిజాల నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చినట్లయితే వీటన్నింటినీ ఇక నుండి సొంతంగానే తవ్వకాలు జరిపాలని అధికారులు నిర్ణయించారు. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా గ్రానైట్, సున్నపు రాయి నిల్వలు ఉన్నట్లు బయటపడింది.

Read also: ఘోరం డబ్బు కోసం స్నేహితుడిని నరికేశాడు!

తెలంగాణలో మినరల్స్ తవ్వకాల విశ్లేషణ: గ్రానైట్, సున్నపురాయి ప్రధాన నిల్వలు

ఈ మేరకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో గ్రానైట్, సున్నపు రాయి. నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్(telangana)నిల్వలు భారీగా ఉన్నట్లు తేల్చింది. కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, ఖమ్మం జిల్లాలో కొత్తగట్టు, నమిలికొండ, వెంతడుప, తాళ్లపూసపల్లె తదితర ప్రాంతాల్లో 83.25 హెక్టార్ల విస్తీర్ణంలో 28,400 క్యూబిక్ మీటర్లలో తెలుపు, బ్రౌన్, నలుపు రకాలకు చెందిన గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా నల్లగొండ, సూర్యాబాద్, వికారాబాద్ జిల్లాల్లో సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నట్లు కనుగొంది. ఆయా జిల్లాల్లోని సూర్యాపేట్ జిల్లాలోని మేళ్లచెర్వు, మఠంపల్లి, రఘునాధపాలెం, రామాపురం, దొండపాడు, నల్లగొండ జిల్లా తామరచెర్ల, వికారాబాద్ జిల్లా మల్కాపూర్, జివంగి ప్రాంతాల్లో 276.83 కిలోమీటర్ల విస్తీర్ణంలో సున్నపు రాయి నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు వీటికి సంబంధించిన తాజాగా నివేదికను ఖనిజాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. ఇదే సమయంలో ఈ నిక్షేపాలను తవ్వేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Granite latest news MineralDevelopment minerals Telangana Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.