Accreditation card: జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

Read Time:  1 min
Accreditation card: జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
FONT SIZE
GET APP

Accreditation card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025’ను అధికారికంగా విడుదల చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) జీవో నెం.252ను జారీ చేస్తూ, కొత్త నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు ఫిబ్రవరి 9 నుంచి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Read also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Accreditation card: Good news for journalists.. Applications for accreditations will be accepted from the 9th.
Accreditation card: Good news for journalists.. Applications for accreditations will be accepted from the 9th.

అక్రిడిటేషన్లకు అర్హత

అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండనుంది. అక్రిడిటేషన్లకు అర్హత కోసం దినపత్రికలు కనీసం 2 వేల ప్రతుల సర్క్యులేషన్ కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. అదేవిధంగా వార, పక్ష పత్రికలు కనీసం 18 నెలల పాటు నిరంతరంగా ప్రచురితమై ఉండాలనే కండీషన్ కూడా ఉంది. డెస్క్ జర్నలిస్టుల విషయంలో మీడియా సంస్థలు కనీసం 33 శాతం మహిళలకు కేటాయించడం తప్పనిసరి చేశారు. అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కనీసం ఏడాది కాలంగా నడుస్తున్న వెబ్‌సైట్లు, గత ఆరు నెలల్లో సగటున నెలకు 5 లక్షల యూనిక్ విజిటర్లను కలిగి ఉన్న పక్షంలో అక్రిడిటేషన్‌కు అర్హలు. కార్డు జారీ తర్వాత అక్రిడిటేషన్ కార్డు పోతే డూప్లికేట్ లేదా రీప్లేస్‌మెంట్ కార్డుల కోసం రూ.250 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.