📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఇంటి వద్దకే మేడారం బంగారం

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ జాతరకు సంబంధించిన బంగారం ప్రసాదంను టిజిఎస్ ఆర్టీసి(TGS RTC) భక్తులకు ఇంటికే తెచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఈ వినూత్న పథకాన్ని ఆర్టిసి ప్రారంభించింది. గతంలోనూ ఇటువంటి ప్రయత్నం చేసిన ఆర్టీసి ఇందుకు సంబంధించి ప్రసాదంను ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో తెలిపే పోస్టర్ను ఆర్టిసి ఎండి వై నాగిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. మేడారం బంగారం ప్రసాదం బుకింగ్కు సంబంధించిన పోస్టర్ను ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, సి.టి. ఎం (మార్కెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్, ఏటిఎం రాజన్తో కలిసి ఆర్టిసి వైస్ఛెర్మన్, ఎండి వై నాగిరెడ్డి ఆవిష్కరించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.

Read also: Road Safety: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి

ఆర్టిసి అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్

ఈ నేపథ్యంలో అమ్మవార్లకు బంగారం సమర్పించాలనకునే భక్తుల కోసం టిజిఎస్ ఆర్టీసి ప్రత్యేక సేవల్ని ఏర్పాటు చేసింది. (Telangana) ములుగు (వరంగల్) జిల్లాలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతలను పూజించడానికి తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని బంగారం సమర్పించుకుంటారు. వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టిసి లాజిస్టిక్ తగు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేవాదాయ శాఖ సహకారంతో, మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుంది. ఇందకుగానూ, బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/ చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఆర్టిసి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా, సమీపంలోని టిజిఎస్ ఆర్టీసి లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ఎండి ప్రకటించారు. మరింత సమాచారం కోసం టిజిఎస్ఆర్టిసి కాల్ సెంటర్లు 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



Gold Prasadam hyderabad Latest News in Telugu medaram Mulugu District Online Booking Sammakka Saralamma Jatara Telugu News TSR RTC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.