📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

Author Icon By Saritha
Updated: February 18, 2026 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: మెదక్ జిల్లా(Medak District) కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. ఆస్తి హక్కులకు సంబంధించి రెండు పక్షాలకు నోటీసులు పంపి భూ వివాదాన్ని పరిష్కరించాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ మేరకు శిక్షను విధిస్తూ తీర్పును విలువరించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

Read Also: Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Telangana: Medak District Collector sentenced to 6 months in prison

మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాల్‌ గ్రామం సర్వే నంబర్ 284/ఎ/2లో 2.22 ఎకరాల భూమి హక్కులకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్‌ అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ నల్లవెల్లి లక్ష్మి అనే మహిళ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లక్ష్మి తన తాత ఊషయ్య భూమిని మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయాలని పెట్టుకున్న అర్జీపై స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌ రాజ్‌ ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని కోర్టు ఈ మేరకు కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల ఫైన్ విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. అయితే కలెక్టర్ అప్పీలు చేసుకోవడానికి కోర్టు తీర్పు అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Collector Abhilash Abhinav Court Contempt Jail sentence Land Dispute Latest News in Telugu Medak district Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.