తెలంగాణలో(Telangana) మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వెలువడింది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.
Read also: Telangana Politics:పాలమూరు–రంగారెడ్డి అంశంపై రాజకీయ రచ్చ
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి గతంలో పనిచేసిన వ్యక్తిగా దేవాను గుర్తించారు. ఆయన పాత్ర పలు కీలక ఘటనలతో ముడిపడి ఉన్నట్టు సమాచారం. ఈ ఆపరేషన్‌లో దేవాతో పాటు మరో 15 మంది వరకు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. వీరంతా మావోయిస్టు నెట్‌వర్క్‌కు సంబంధించినవారేనా? లేక అనుబంధ వ్యక్తులా? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.
కోర్టులో హాజరు పరచాలంటూ పౌరహక్కుల సంఘాల డిమాండ్
ఈ అరెస్టులపై పౌరహక్కుల(Telangana) సంఘాలు స్పందించాయి. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, వారి ఆరోగ్య పరిస్థితులు, న్యాయపరమైన హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికారికంగా అరెస్టులపై ప్రకటన రావాల్సి ఉండటంతో స్పష్టత కోసం రాజకీయ, పౌరసంఘాలు ఎదురుచూస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: