ఇప్పటి వరకూ 6.45 లక్షల ఎకరాల్లో సాగు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజనులో మొక్కజొన్న పంట(Maize Cultivation) విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. యాసంగి సీజన్లో తెలంగాణ(Telangana)లో 6.45 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, ఇప్పటి వరకూ 6.70 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 1.34 లక్షల ఎకరాల్లో, నాగర్కర్నూల్ 68 వేల ఎకరాలు, వరంగల్ 61వేల ఎకరాలు, కొత్తగూడెం 50 వేల ఎకరాలు, మహబూబాబాద్ 49 వేల ఎకరాలు, నిర్మల్ 43 వేల ఎకరాలు, నిజామాబాద్ 32 వేల ఎకరాలు, జగిత్యాల 30 వేల ఎకరాలు, గద్వాల 29 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 27 వేల ఎకరాల్లో రైతాంగం మొక్కజొన్న సాగు నమోదైంది.
Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
పొగాకు సాగుపై కేంద్ర నిషేధం ప్రభావం
ఈ విధంగా పెరిగితే సీజన్లు ముగిసే నాటికి ఈ విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు వల్ల మార్కెట్లో శనగలు, ఆపరాలు, కందుల ధరలు పడిపోయాయి. మరోపక్క పొగాకు సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో యాసంగిలో ఏ పైరు వేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టవడి వంటలు వండించినా గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా అనేదానిపై భయపడుతున్నారు. మొక్కజొన్నకు మాత్రమే గత ఏడాది మద్దతు ధర లభించింది.
పంట మార్కెట్లోకి వచ్చే సమయానికి ధరలపై ఆందోళన
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగు చేస్తుండగా, అందరూ ఈ ఒక్క వంటే ఎక్కువగా పండించడంతో వంట మార్కెట్లోకి వచ్చే సమయానికి మద్దతు ధర ఏ విధంగా ఉంటుందనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేరుశనగ సాగు చేద్దామనుకున్నా ఈ వంటకూ మార్కెట్లో ధర లేదు. మినుములు, సాగు చేసినా పంట చేతికి వచ్చిన తర్వాత కనీస మ ధర దక్కుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతో దీంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సా దృష్టిసారించారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున మక్కల సాగు షురూ కావడంతో ముగిసే నాటికి ఈయేడు మక్కల సాగు రికా సృష్టించనుందని ప్రభుత్వ స్పష్టమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: