Telangana: తెలంగాణ మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలపై టీపీసీసీ TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ Mahesh kumar goud స్పందించారు. ఇది పెద్ద వివాదమేమీ కాదని, కేవలం కుటుంబంలో తలెత్తే చిన్నపాటి అపార్థమని పేర్కొన్నారు. అలాంటి విషయాలను పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల ఆయనకు పేస్‌మేకర్ అమర్చిన నేపథ్యంలో, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, “మంత్రుల మధ్య వచ్చిన విభేదాలు పూర్తిగా సమాచార లోపం వల్లే చోటు చేసుకున్నాయి. పెద్దగా పట్టించుకునే అంశం కాదు” అని అన్నారు.
Telangana: ఎర్రశేఖర్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే గురించి కూడా ఖర్గేకు (kharge) వివరించినట్లు తెలిపారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో (supreme court) సవాల్ చేయనున్నట్లు వెల్లడించారు. Telangana రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు కొనసాగించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రుల మధ్య వివాదంపై మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారు?
ఇది పెద్ద విషయం కాదని, కుటుంబంలో తలెత్తే చిన్న అపార్థమని, పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు.
మల్లికార్జున ఖర్గేను ఆయన ఎందుకు కలిశారు?
ఇటీవల పేస్‌మేకర్ అమర్చిన ఖర్గే ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఆయన ఢిల్లీలో కలిశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: