📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana: మద్యం టెండర్లకు తగ్గిన స్పందన

Author Icon By Sushmitha
Updated: October 17, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ‌లో కొత్త మద్యం(Liquor) దుకాణాల టెండర్ల ప్రక్రియకు అనూహ్యంగా స్వల్ప స్పందన లభిస్తోంది. దరఖాస్తుల గడువు ముగింపునకు ఒక్క రోజే మిగిలి ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే, దరఖాస్తుల సంఖ్య పెంచేందుకుగాను.. గతంలో లైసెన్సులు పొందిన వారికి స్వయంగా సందేశాలు (ఎస్‌ఎంఎస్) పంపి దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

Read Also: Tomiichi Murayama: 101 ఏళ్ల జ‌పాన్ మాజీ ప్ర‌ధాని క‌న్నుమూత‌

గతేడాది కంటే దారుణంగా దరఖాస్తులు

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల(license) కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రేప‌టితో (అక్టోబర్ 18) ఈ గడువు ముగియనుంది. అయితే, గురువారం నాటికి కేవలం 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. చివరి రోజు దరఖాస్తులు వెల్లువెత్తినా, మొత్తంగా లక్ష లోపే పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆదాయంపై ఆందోళన, సిండికేట్ ఆరోపణలు

దరఖాస్తుల సంఖ్య తగ్గడం ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మద్యం వ్యాపారంపై ఆసక్తి తగ్గడానికి పలు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్(Real estate) రంగం మందగించడం, ఇతర వ్యాపారాలు ఆశాజనకంగా లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దీనికి తోడు, కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పోటీని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే దరఖాస్తులు తక్కువగా వేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

మద్యం దుకాణాల దరఖాస్తు గడువు ఎప్పుడు ముగుస్తుంది?

రేపటితో (అక్టోబర్ 18) దరఖాస్తుల గడువు ముగియనుంది.

దరఖాస్తులు పెంచడానికి అధికారులు ఏం చేస్తున్నారు?

గతంలో లైసెన్సులు పొందిన వారికి స్వయంగా ఎస్‌ఎంఎస్‌లు పంపి దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

applications low excise revenue Google News in Telugu government revenue. Latest News in Telugu syndicate issue Telangana liquor shops Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.