📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: మహిళా సంఘాలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల రుణం–

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త

హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు కట్టుకోలేని లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9,175 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 393 మందికి రూ.4.34 కోట్ల రుణాలు అందజేశారు. త్వరలో మున్ని పాలిటీల్లోని లబ్దిదారులకు కూడా రుణాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు విడతల్లో అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. శరవేగంగా ఇంటి నిర్మాణ పనులు సాగుతున్నాయి.

మహిళా సంఘాల ద్వారా రుణాలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా లబ్దిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు కట్టుకోలేకపోతున్న లబ్దిదారులకు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఊరట లభిస్తోంది. యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9.175 ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Illu) ను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్దిదారులకు రుణాలు ఇప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9,175 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇల్లు మంజూరైన సమయంలోనే పేదలకు రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాలో 5,980 ఇండ్లకు పునాది వేశారు.

Telangana: మహిళా సంఘాలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల రుణం–

రుణాలు ఇచ్చేలా

చాలామంది డబ్బులు లేక ఇల్లుకట్టడం మొదలు పెట్టలేదు. దీంతో లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు మంజూరైన లబ్దిదారులు మహిళా సంఘాల్లో (SHG) సభ్యులై ఉంటే రుణం తీసుకోవడానికి అర్హులు. సంఘాల లీడర్లతో అధికారులు మాట్లాడి రుణాలు ఇచ్చేలా చూస్తున్నారు. మూడు రకాలుగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదువు ద్వారా రుణం ఇస్తారు. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్నీ (డీఆర్డీఏ) ఇందుకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటుంది. సభ్యుల అర్హతను బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. సంఘంలో తీసుకున్న రుణాన్ని 10 వాయిదాల్లో కట్టవచ్చు. గతంలో రుణం తీసుకుంటే, ప్రభుత్వం నాలుగు విడతలుగా ఇచ్చే డబ్బులోంచి ఆ రుణం చెల్లించాల్సి ఉంటుంది.

రుణంగా

జిల్లాలో మొత్తం 2 వేల మందికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 393 మందికి రూ. 50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇచ్చారు. మొత్తం రూ. 4.34 కోట్లు రుణంగా అందించారు. ఇప్పటివరకు గ్రామీణప్రాంతాల లబ్దిదారులకే రుణాలు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీ (Municipality) ల్లోని లబ్దిదారులకు కూడా రుణాలు ఇప్పించడానికి సిద్ధమవుతున్నారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారికి రుణాలు ఇప్పిస్తారు. ఇల్లు మంజూరైన లబ్దిదారుల్లో నిర్మాణం ప్రారంభించడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారికి మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని, 2 వేల మందికి ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని అధికారులు తెలిపారు.

భారతదేశంలో SHG (స్వయం సహాయ సంఘం) వ్యవస్థను మొదటగా ఎవరు ప్రారంభించారు?

భారతదేశంలో SHG వ్యవస్థకు ఆది 1970లో ఏర్పాటు చేసిన సెల్ఫ్-ఎంప్లాయ్డ్ వుమెన్స్ అసోసియేషన్ (SEWA)తో మొదలైంది. ఇది స్వయంస్థాపిత మహిళల సంఘంగా ప్రారంభమైంది.

స్వయం సహాయ సంఘాల ఐదు సూత్రాలు (Pillars of SHG) ఏవీ?

స్వయం సహాయ సంఘాలు (SHGs) సాధారణంగా 10 నుండి 20 మంది సభ్యుల (తర్వాత మహిళలు)తో కూడిన సామాన్య ఆసక్తులు కలిగిన గుంపులుగా ఉంటాయి.నియత కాల వ్యవధిలో సమావేశాలు,నియమితమైన పొదుపు,అంతర్గత రుణాల మంజూరు,నియమితంగా రుణపు తిరుగు చెల్లింపులు,ఖాతాల నిర్వహణ (బుక్ కీపింగ్).

Read hindi news: hindi.vaartha.com

Read Also: Kharif: గత యేడాది కంటే తగ్గిన ఖరీఫ్

Breaking News Congress Government Telangana Indiramma houses Yadadri Indiramma Housing Scheme latest news Telangana housing scheme 2024 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.