తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 13న జరగనుంది. శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఫలితాలు దశలవారీగా వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.దాదాపు రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుండగా.. మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుంది.
Read Also: Kavitha: పార్టీ పెడతానంటే దాడులు చేస్తున్నారు
నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేస్తే చర్యలు
ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగియగా.. 73.01 పోలింగ్ శాతం నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం నమోదైంది. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి. భాగంగా శుక్రవారం కౌంటింగ్ జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. 13వ తేదీన ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం మునిసిపాలిటీలతో పాటు కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట, అలియాబాద్, ముడిచింతలపల్లి పరిధిలో కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరా నిలిపివేయనున్నారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం, చిట్కుల్, ఇస్నాపూర్, రుద్రారంతో పాటు గడ్డపోతరం మున్సిపాలిటీలోని గడ్డపోతరం, ఖాజీపల్లి, మాధార, ముడిచింతలపల్లి మునిసిపాలిటీలో మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. అటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: