📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: పరిశ్రమలకు ఉన్నత విద్యారంగం అనుసంధానం

Author Icon By Tejaswini Y
Updated: February 5, 2026 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : విద్యా వ్యవస్థను పరిశ్రమలకు అనుసంధానించేందుకు విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా 100 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేయాలని విశ్వవిద్యాలయాల ఉప కులపతులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వీ. బాలకిష్టారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు.

Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

Telangana: Linking higher education to industries

100 రోజుల కార్యచరణ ప్రణాళిక అవసరం

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు, నిలకడ, నాణ్యత, ర్యాంకింగ్ మెరుగుదలకు 100 రోజుల కార్యచరణ ప్రణాళిక అవసరం ఎంతో ఉందన్నారు. ఈ మేరకు యూనివర్సిటీల వీసీల సమావేశాన్ని బుధవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమలకు అనుసంధానంగా ఉన్నత విద్యను మార్చేందుకు ఉమ్మడి గ్రాడ్యుయేట్ ప్రమాణాల(Graduate standards) రూపకల్పన, ఉమ్మడి పరిశోధనా సౌకర్యాల ఏర్పాటు, అధ్యాపక శిక్షణా కార్యక్రమాల ప్రారంభం, ఏకీకృత ఇంటర్ షిప్ గ్రిడ్ ఏర్పాటు, ప్రాధాన్యత ఉన్న మిషన్ల నిర్వహణ తదితర అంశాలు ఎంతో కీలమన్నారు. ఈ నేపథ్యంలో 100 రోజుల కార్యచరణను యజుంలా అమలు చేయాలని, ఇందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలు, పూర్వ విద్యార్థఉల స్మఏళనాలతో కూడిన సంబంధాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత విధులను అకడమిక్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్) కోసం ఖర్చుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవావహన, వీరనారి చాకలి ఐలమ్మ, జేఎన్టీయూ, ఆర్టీయూకేటీ విశ్వ విద్యాలయాల వీసీలు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

100 Days Action Plan for Universities Higher education Telangana Industry-Academic Collaboration Telangana University VC Meeting TGCHE Chairman Balakista Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.