📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Telangana: పిడుగుపాటుకు ఏడుగురు మృతి

Author Icon By Sharanya
Updated: September 11, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ (Nirmal)జిల్లా పెంబి మండలం గమ్మనుయెంగ్లాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు మరణించిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వీరంతా పత్తిచేనులో కాపలా కాసేందుకు చేనులోనే వున్న చిన్నపాటి షెడ్డులో వుండగా ఈ దుర్ఘ టన జరిగింది. మృతుల్లో ఇద్దరు దంపతులు వున్నారు. వివరాలు ఇలావున్నాయి.

News telugu

వేరు వేరు ప్రాంతాలలో పిడుగుపాటుకు మృతి

గమ్మనుయెంగ్లాపూర్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం మరింత ఎక్కువయ్యింది. ఈ సమయంలో పత్తి చేనులో కాపలగా వున్న బండారు వెంకటి (50), అల్లపు ఎల్లయ్య (38), అతని భార్య ఎల్లవ్వ (34) చేనులోనే వున్న చిన్న పాటి షెడ్డులో నిలపడి వున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా వీరు నిలుచున్న షెడ్డుపై పిడుగు పడింది. దీంతో అక్కడ వున్న ముగ్గురు ఘటనా స్థలిలోనే చనిపోయారు. ఈ విషయం గంట తరువాత స్థానికులు ద్వారా గ్రామంలో అందరికి తెలియడంతో అందరు ఒక్క సారిగా పత్తిచేనుకు తరలివచ్చి విలపించారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన ఎల్లయ్య, ఎల్లవ్వ దంపతులకు 13 ఏళ్ల కుమార్తె, తొమ్మిదేళ్ల కుమారుడు వుండగా, వెంకటికి భార్య, కుమారుడు, వున్నారు. ఈ ఘటనపై పెంబి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నిరుపేద వ్యవసాయ కూలీలవడంతో వారి కుటుంబా లను ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. జోగులంబ గద్వాల్ (Jogulamba Gadwal)జిల్లాలో అయిజ మండలం భూంపురంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం పత్తి పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై పిడుగు పడింది. ఆకస్మికంగా వచ్చిన వర్షంలో పిడుగుపాటు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. వారిని గద్వాల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులు సాభాగ్య (45), పార్వతమ్మ (22), సర్వేష్ (20)గా గుర్తించారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి చేనులో పనిచేస్తున్న మొత్తం ఏడుగురు కూలీలు వర్షం రావడంతో పొలంలో ఉన్న వేప చెట్టు కిందకి వెళ్లారని ఆ చెట్లుపై ఆకస్మికంగా పిడుగు పడటంతో ఏడుగురు అక్కడికక్కడే కుప్పకూలారని తెలిపారు. వారిని హుటాహుటిన అయిజ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించగా ఇప్పటికే ముగ్గురు మృతి చెందారని నలుగురికి తీవ్ర గాయలైనట్లు తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఖమ్మంజిల్లా ఆరేపల్లి మండల పరిధిలోని మేకల తండా గ్రామం గూగులోతు మోహన్రావుకుచెందిన ఆవు పిడుగుపడగా మృతిచెందింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యానారాయణపురంలో పిడుగుపాటుకు రైతు మృతిచెందాడు. కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిరప తోటలో పనిచేస్తున్న రైతు గుగులోతు బావుసింగ్ పై పిడుగు పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పక్కనే ఉన్న స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/shamshabad-marijuana-worth-rs-14-crore-seized-at-shamshabad-airport/hyderabad/545095/

Breaking News latest news LightningStrike Telangana TelanganaDisaster Telugu News Thunderstorm WeatherAlert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.