హన్మకొండ: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సులు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. భూ సమస్యలపై 8 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. 3 దశల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సు (Revenue conference)ల్లో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో ముందుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
రెండో దశ కింద మరో 28 మండలాల్లో దరఖాస్తులు
ఆ తర్వాత రెండో దశ కింద మరో 28 మండలాల్లో దరఖాస్తులను స్వీకరించారు. మూడో విడతగా మిగిలిన మండలాల్లో నిర్వహించారు. మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు 4మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12వేల దరఖాస్తులు అందాయి. రెండవ దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు అందాయి. సాదాబైనామాల అంశం మినహా సుమారు 60 శాతంపైగా సమస్యలకు పరిష్కారం చూపారు. జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48వేలు, నల్గొండ 42వేల దరఖాస్తులు అందాయి. రెవె న్యూ సదస్సులకు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులను పంపిణీ చేశారు. స్వీకరించిన వాటికి రశీదులను దజేశారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు.
Read also: Rythu Bharosa : ORR లోపలి భూములకు రైతు భరోసా విడుదల