తెలంగాణ (Telangana) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ఎర్రవెల్లి ఫాంహౌస్ లో, కొనసాగుతోంది. పలు అంశాలపై వీరిద్దరూ విస్తృతంగా చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.కేసీఆర్ తో నిన్న హరీశ్ రావు భేటీ అయిన సంగతి తెలిసిందే.
Read Also: corruption : రాజకీయ అవినీతికి అంతం లేదా?
మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది
కేసీఆర్ కు అందిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై నిన్న హరీశ్ తో, ఈరోజు కేటీఆర్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలి,
మీడియా ముందుకు ఎలాంటి అంశాలను తీసుకెళ్లాలనే అంశాలపై చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గించాలనే పట్టుదలతో ఉంది. సిట్ అడిగే ప్రశ్నలు, సమాధాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: