📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Telangana: సౌర విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

Author Icon By Pooja
Updated: September 29, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. ఈ మేరకు పౌరసంబంధాల శాఖ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండారెడ్డిపల్లిలో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్ర రెడ్కో ద్వారా రూ.10.53 కోట్లతో 514 ఇండ్లతో, పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 కెడబ్ల్యూ స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 కెడబ్ల్యూ(60 kW) సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు.

Read Also: Crime:హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్.. ఎక్కడంటే?

మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థం 1,500 కెడబ్ల్యూగా ఉంది. మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, ఇండ్ల పైన సౌర విద్యుత్ పరికరాలు ఈ బిగించనున్నట్లు రెడ్కో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె.మనోహర్రెడ్డి తెలిపారు.

కొండారెడ్డిపల్లిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.10.53 కోట్లు కాగా, అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ నిమిత్తం కేంద్రం సబ్సిడీ కింద రూ.3.56 కోట్లు, ప్రైవేటు కంపెనీ నుండి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా(social responsibility) రూ4.092 కోట్లు భరించాయి. మరో రూ.2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు. కాగా ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి (రోజుకు 120 యూనిట్లు) అవుతుంది. ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఇంటి వినియోగానికి పోగా, మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్కు పంపే విద్యుత్ యూనిట్కు రూ.5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ నెలలో విద్యుత్ గ్రిడ్కు గ్రామం నుండి సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ.5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించినట్లు పౌరసంబంధాల శాఖ వెల్లడించింది.

కొండారెడ్డిపల్లి ఏ జిల్లాలో ఉంది?
కొండారెడ్డిపల్లి నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూర్ మండలంలో, అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉంది.

ఈ గ్రామం ఎందుకు ప్రత్యేకంగా గుర్తింపు పొందింది?
కొండారెడ్డిపల్లి గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా గుర్తింపు పొందింది. ఇది దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Kondareddypally Renewable Energy Revanth Reddy Solar Power Solar Village Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.