తెలంగాణ(Telangana)లో కృష్ణా జలాల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. కృష్ణా నది నీటి కేటాయింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీరు చాలుతుందని పేర్కొంటూ కేంద్రానికి లేఖ పంపడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులతో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో హరీశ్ రావు, కేటీఆర్‌తో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: