📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Telangana: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కవిత కీలక ప్రకటన

Author Icon By Tejaswini Y
Updated: January 5, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఉద్దేశపూర్వకంగా అవమానించి మండలి నుంచి బయటకు పంపించారని వాపోయిన ఆమె, తనకు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని కన్నీళ్లతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే సమర్పించిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోసారి విజ్ఞప్తి చేశారు.

Read also: Jaggareddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ నేతలు

గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు…

మండలి నుంచి బయటికి వచ్చిన అనంతరం కవిత గన్‌పార్క్‌కు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆమె, రానున్న ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. తనకు జరిగిన అవమాన భారంతోనే రాజకీయ, వ్యక్తిగత బంధాల నుంచి బయటకు వచ్చానని చెప్పారు.

Telangana: Kavitha’s key statement that she will contest the next elections

తెలంగాణకు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం

తెలంగాణ జాగృతితో కలిసి పనిచేసేందుకు వామపక్ష పార్టీలను, మావోయిస్టు సానుభూతిపరులను ఆహ్వానిస్తున్నట్లు కవిత తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలు అవసరమని వ్యాఖ్యానించిన ఆమె, టీఆర్ఎస్ ఆవిర్భావం నాటి ఉద్యమకారులకు బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు దక్కలేదని ఆరోపించారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్నారు.

బీఆర్ఎస్(BRS) పాలనలో నీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సరైన తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆశలు నెరవేరతాయని నమ్మినవారికి నిరాశే మిగిలిందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, మహిళలు మరియు నిరుద్యోగులకు న్యాయం చేయలేదని ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భావించి తెలంగాణ జాగృతి రాజకీయ రంగంలోకి అడుగుపెడుతోందని తెలిపారు. తెలంగాణ జాగృతి నిరుద్యోగులకు, దళితులకు, మైనార్టీలకు రాజకీయ వేదికగా మారుతుందని పేర్కొన్న కవిత, ఎవరిపై ఆధారపడకుండా ప్రజలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం ఖరారైన విషయమని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BRS Politics Gun Park Kavitha Resignation mlc kavitha telangana jagruthi Telangana Movement Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.