📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telangana : జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

Author Icon By Digital
Updated: April 19, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : టోక్యో, ప్రభాతవార్త: జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గురించి వివరించిన ఆహ్వానం శుక్రవారం టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలంగాణ అధికార బృందం వివరించింది.సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “జపాన్ పారిశ్రామికవేత్తలందరికి తెలంగాణ రాష్ట్రం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. మేము ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో ముందుకు సాగుతున్నాం,” అని తెలిపారు. అలాగే టోక్యో నగరం నుంచి ఎంతో నేర్చుకున్నానని, హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో మోడల్ ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన పాలన విధానాలు తమ ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్‌టైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు.

Telangana : జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఈ సందర్భంగా భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించారు. జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ కూడా తెలంగాణతో వ్యాపార సహకారం మరింత బలపడాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రచార వీడియోలను వేదికపై ప్రదర్శించింది. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి నెట్-జీరో ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు.వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జపాన్ కంపెనీలకు తెలంగాణలోని అనుకూల వాతావరణం గురించి వివరించారు. రోడ్‌షో అనంతరం తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని ప్రముఖ కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. వివిధ రంగాలలో పెట్టుబడులకు వీలు ఉన్న అవకాశాలను ఈ భేటీలో చర్చించారు.

Read More : Elon Musk : పుతిన్ ప్రశంసలు, స్టార్లింక్‌కు ముప్పు

Business Opportunities CM Revanth Reddy Economic Partnership Future City Google News in Telugu hyderabad Industrial Development Investment japan Japanese Industrialists JETRO Latest News in Telugu Muzi Revitalization Project Roadshow Telangana Telugu News Telugu News online Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.