Telangana Inter Exams: ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు

Read Time:  1 min
Telangana Inter Exams: ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
FONT SIZE
GET APP

Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు (Inter Board) కార్యదర్శి కృష్ణాదిత్య ఐఏఎస్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.

పరీక్షా కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కళాశాలలతో పాటు ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను సెంటర్లుగా ఎంపిక చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కువ సెంటర్లు ఉండగా, ఇతర జిల్లాల్లో ప్రభుత్వ సంస్థలకే ప్రాధాన్యతనిచ్చారు. దాదాపు 28,500 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండబోతున్నారు.

Read Also: Kavitha: జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ ప్రారంభం

Telangana Inter Exams: ఈ నెల 25 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
Telangana Inter Exams: Telangana Inter exams from 25th of this month

ప్రతి సెంటర్‌పై ప్రత్యేక పర్యవేక్షణ

మాస్ కాపీయింగ్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా దాదాపు 30 వేల సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించబోతున్నామని, ప్రతి సెంటర్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్వి కృష్ణాదిత్య తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని… కానీ, ఆ ఆందోళన వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, అందుకే నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరారు. 

ఫీజుల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా అందరికీ హాల్ టికెట్లు అందేలా చర్యలు తీసుకున్నట్లు కృష్ణాదిత్య తెలిపారు. కోర్టుకు వెళ్లిన విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు మరియు రవాణా సౌకర్యాల కోసం ఆయా శాఖలతో సమన్వయం చేసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేక కమిటీని కూడా రంగంలోకి దించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.