Exam grace time : ఇంటర్ పరీక్షలకు ఊరట, ఆలస్యంగా వచ్చినా ఛాన్స్!

Read Time:  1 min
Exam grace time
Exam grace time
FONT SIZE
GET APP

Exam grace time : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు కీలక ఊరటనిచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న “ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు” నిబంధనలో సడలింపు ఇస్తూ, పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకునే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.

Read also: Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

Exam grace time
Exam grace time

5 నిమిషాల గ్రేస్ టైం

ట్రాఫిక్ సమస్యలు, రవాణా ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9:05 వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి ప్రవేశం ఉండదు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పరీక్షలను మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా నిర్వహించేందుకు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, వివరాల్లో పొరపాట్లు ఉంటే ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయడంతో పాటు సెక్షన్ 144 అమలు చేయనున్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే మూడు సంవత్సరాల పాటు డిబార్ చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ORS ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.