📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Telangana: వైభవంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

Author Icon By Anusha
Updated: July 18, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు 5,474 కోట్ల బీమా చెక్కులు

హైదరాబాద్ : ఇందిరా మహిళా శక్తి సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాన్ని తలపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినూత్న కార్యక్రమాలతో మహిళా స్వయం సహాయక బృందాలు సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఇందిరా మహిళా శక్తి సంబురాలు బతుకమ్మ వేడులకు తలపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో మహిళా సభ్యులు పాల్గొంటు తమకు దక్కిన గౌరవాన్ని చాటుతున్నారు. ఆర్దిక విజయాలు సాధించిన మహిళ సంఘాలు మంత్రుల నుంచి సన్మానాలు అందుకున్నాయి. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటు వడ్డీ చెక్కులను పంపిణి చేస్తున్నారు. మహిళా శక్తిని అభినందిస్తూ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలను వివరిస్తున్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. మహిళా సంఘాలచే నిర్వహించబడే ఆర్టీసీ నూతన అద్దెబస్సులను, వివిధ వ్యాపారాల ప్రారంభోత్సవాలు చేస్తూ మహిళా సంఘాలను ప్రొత్సహిస్తున్నారు.

మహిళా శక్తి

ఈ సంబురాల్లో భాగంగా మహిళల విజయగాథలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగిస్తున్న వ్యాపారాలు, పొందుతున్న ఆదాయం, తమ వ్యాపార అనుభవాలను వేదికలపై వివరించారు. వేల కోట్ల రూపాయల రుణ సదుపాయం కల్పించడంతో పాటు అన్ని వ్యాపారాల్లో తమకు అవకాశం కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగిన ఇందిరా మహిళా శక్తి సంబురాలు (Mahila Shakthi Samburalu) శుక్రవారంతో ముగియనున్నాయి. పది రోజుల పాటు నియెజకవర్గాల్లో మహిళా కనిపించింది. ఇందిరా మహిళా శక్తి ఉత్సవాలు మహిళా సాధికారతకు వేదికగా నిలిచాయి. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా ఈ దఫా మహిళా సంఘాలకు రూ.344 కోట్ల ను ప్రభుత్వం చెల్లించింది. ఇందులో గ్రామీణ మహిళ సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్ల చెల్లింపులు చేసింది.

ప్రభుత్వమే రూణాలను

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు, వారి చే సొంత వ్యాపారాలను ప్రారంబింపచేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో బాగంగా ప్రతి ఏటా కనీసం రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వమే రూణాలను సమకూర్చుతోంది. మహిళలు తీసుకున్న లోన్లకు సకాలంలో వడ్డీలు చేల్లిస్తోంది. దీంతో పాటు ప్రమాద బీమా, లోన్ బీమా వంటి స్కీంలను అమలు చేస్తుంది. దీంతో ప్రమాద వశాత్తు మహిళా సభ్యురాలు మరిణిస్తే ఆ కుంటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరన్న మహిళలు నష్టాలతో బ్యాంకు లోన్లు చెల్లించలేని పరిస్థిలో ఉంటే, ఇతర మహిళలకు భారం కాకుండా ప్రభుత్వమే రూ.2 లక్షల వరకు లోన్ బీమా చెల్లిస్తుంది.

Telangana: వైభవంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

లోన్ బీమా

ఇప్పటివరకు 410 మంది సభ్యులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయలు చెల్లించగా, లోన్ బీమా కింద 5474 మంది సభ్యులకు రూ.2 లక్షల వరకు చెల్లింపులు చేసింది. ప్రమాద బీమా, లోన్ బీమా తోపాటు ప్రజా ప్రభుత్వం సకాలంలో వడ్డీలు చెల్లిస్తుండటంతో ఉత్సాహంగా మహిళా సంఘాల్లో కొత్త సభ్యులు ఉత్సాహంగా చేరుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 1.67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో కొత్తగా సభ్యులుగా చేరారు. దీంతో పాటు మహిళా సంఘాల్లో చేరే సభ్యుల అర్హత వయసును సడలించారు.

మహిళా సంఘాల్లో

గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వయసులో గల మహిళలకే అవకాశాలుండగా,ఇప్పుడు 15 65 ఏండ్ల మహిళలకు మహిళా సంఘాల్లో చేరే అవకాశం కల్పించారు. దీంతో పాటు దివ్యాంగ మహిళలకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఊపందుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాల (SHG) కు ప్రాధాన్యత విశేషంగా పెరుగుతోంది. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 64 లక్షల సభ్యత్వాన్ని కోటి వరకు చేర్చే కార్యచరణను అమలు చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి సంబు రాలను విజయవంతం చేసిన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేకత ఏమిటి?

తెలంగాణ జూన్ 2, 2014న అధికారికంగా ఏర్పడింది. ఈ రాష్ట్రం తన సాంస్కృతిక వైవిధ్యం, చారిత్రక ప్రాముఖ్యత,ఆర్థిక వృద్ధితో ప్రత్యేకతను కలిగి ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వంటకాలు ఏమిటి?

తెలంగాణ రాష్ట్రం అనేక సాంప్రదాయిక వంటకాలకు పేరుపొందింది. ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వంటకాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ వంటకాలు రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా మంచివిగా పరిగణించబడతాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also: CM Revanth : నేడు నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్

Breaking News Indira Gandhi inspiration for women Indira Mahila Shakti celebrations latest news SHG loan waiver Telangana Telangana women SHG events women empowerment programs India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.