📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

Author Icon By Anusha
Updated: March 5, 2026 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు ప్రధానంగా ఐపీఎస్ అధికారుల కొరతపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని, అదనపు క్యాడర్‌ను కేటాయించాలని సీఎం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Read Also: Telangana Rains: ఈ నెల 18,19 తర్వాత భారీ వర్ష సూచన

క్యాడర్ రివ్యూలో జాప్యం.. కేటాయింపులపై అసంతృప్తి!

రాష్ట్ర విభజన తర్వాత 2016లో మొదటిసారి ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగిందని, ఆ తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ అత్యంత ఆలస్యంగా 2025లో జరిగిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఇంత కాలం నిరీక్షించినా, కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదని అమిత్ షాకు వివరించారు.

Telangana: Increase the number of IPS officers.. CM Revanth’s request to Amit Shah

దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు.హైదరాబాద్, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు. మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేప‌ట్టాల‌ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 మంది ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని.. ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Additional IPS officers request Amit Shah CM Revanth Reddy Cyber crimes and Drugs control Telangana IPS cadre review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.