📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిజిపి శివధర్ రెడ్డికి సిపిఐ నాయకుల విజప్తి

హైదరాబాద్ : గత బిఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయా లని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) తెలంగాణ(Telangana) రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు డిజిపి శివధర్రెడ్డికి సిపిఐ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. గత బిఆర్ఎస్ ప్రభు త్వ పాలనలో చాడ వెంకటరెడ్డి, కోదండరాం, ఈటి నరసింహ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిజిపి శివధర్ రెడ్డికి సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు మారుపాక అనిల్ కుమార్ శుక్రవారం వినతి పత్రము సమర్పించారు.

Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

Telangana: Illegal cases filed during BRS regime should be withdrawn

ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాగొంతుకైన హైదరాబాద్ లోనీ ఇందిరాపార్కు వద్ద ధర్నాలు నిర్వహించవద్దని 2016లో హైదరాబాద్ శివారు బయట ప్రాంతాలలో నిరసనలు, ధర్నాలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్కు వద్దనే ధర్నాలు నిర్వహించుటకు, ధర్నాచౌక్ పునరుద్ధరిం చాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేపట్టడం జరిగింది. చైర్మన్గా తాను, కో చైర్మన్గా పిఎల్. విశ్వేశ్వరరావు, కోదండరామ్, తమ్మినేని వీర భద్రం వంటి రాజకీయ ప్రముఖులు సభ్యులుగా ఉండి ఇందిరా పార్కు ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంను వేదికగా ఏర్పాటు చేసుకొని సుమారు నెల రోజుల పాటు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ పునరుద్ధరణ ధర్నాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.

అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు రోజువారీగా ధర్నాలు చేయడం జరిగిందని, ఇందిరాపార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ హైకోర్టులో ఇందిరాపార్కులో ధర్నాలు నిర్వహించుటకు అనుమతి ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించిందని.. ధర్నాలు రిమోట్ ఏరియాలో ఎలా నిర్వహిస్తారు? ప్రజల గొంతును ప్రభుత్వానికి వినిపించేలా ఉండాలని, అది నగరం మధ్యలోనే ఉండాలని ఇందిరా పార్కులో ధర్నాలు చేపట్టాలని తీర్పునివ్వడం జరిగిందని తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఇందిరాపార్కు అక్రమించడానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు అక్యూపై ధర్నా చౌక్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రభుత్వం తనతోపాటు, అనేక మందిపై కేసులు పెట్టడం జరిగిందన్నారు.

అనంతర కాలంలో ఇదే ఇందిరాపార్కు వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, బిజెపి నాయకులు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధర్నాలు కూడా నిర్వహించడం ప్రజాస్వామ్య విజయమన్నారు. కాబట్టి ఇందిరా పార్కు ధర్నా చౌక్ పునరుద్ధరణ ఉద్యమంలో పాల్గొన్న తనతో సహా వివిధ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల పైన నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. డిజిపి శవధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రితో చర్చించి అన్ని వామపక్ష ప్రజాసంఘ నాయకుల పైన ఉన్న కేసులను పరిశీలించి ఎత్తివేస్తామని తెలియజేశారని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS Government Cases CPI Leaders Memorandum CPI Telangana DGP Shivdhar Reddy Google News in Telugu Illegal Cases Withdrawal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.