📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Hydra: హైడ్రా కూల్చివేతల పై ఈటల రాజేందర్ ఆగ్రహం

Author Icon By Saritha
Updated: February 27, 2026 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Hydra: హైడ్రా (HYDRAA) పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం పేదల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందని, పెద్దల జోలికి వెళ్లడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించి, వెంటనే అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, మూసీ పునరుజ్జీవనం పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మధు రిట్జ్ అపార్టుమెంట్ వాసులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేలు చేసే పనులు చేయాలి తప్ప, వారిని రోడ్డున పడేయడం సరికాదని హితవు పలికారు. న్యాయస్థానాలు కూడా తీర్పులు ఇచ్చేటప్పుడు పేదల జీవితాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: MV Soundararajan: చిలుకూరు బాలాజీ అర్చకులు కన్నుమూత..

Telangana Hydra: Etala Rajender’s anger over Hydra demolitions

ఖమ్మం కూల్చివేతలపై ఆగ్రహం

రాష్ట్రంలో గత మూడు నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు క్లియర్ చేయకపోవడంతో విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు ఈ వయస్సులో సచివాలయం చుట్టు చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలతోనే ఖమ్మంలో ఇళ్లను కూల్చివేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారని, న్యాయస్థానాలు కూడా పేదల జీవితాలను దృష్టిలో ఉంచుకుని తీర్పులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు 40 నుంచి 50 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారని, అలాంటి ఇళ్లను నేలపట్టం చేశారని మండిపడ్డారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Eatala Rajender HYDRAA Telangana Khammam Demolitions rahul gandhi Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.