📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Author Icon By Tejaswini Y
Updated: January 19, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ తెలంగాణ(Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కాసుల వర్షం కురిపించింది. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసి పక్కా ప్రణాళికతో వ్యవహరించిన ఆర్టీసీ యాజమాన్యం, కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ మధ్య సంస్థకు టికెట్ల విక్రయం ద్వారా ఏకంగా రూ.67.40 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున రోజుకు సుమారు రూ. 13.48 కోట్ల చొప్పున ఆర్జించింది.

Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

Telangana: Huge profits for TGSRTC with Sankranti festival

రాష్ట్రవ్యాప్తంగా 6,431 ప్రత్యేక బస్సుల నిర్వహణ

ఈ ఏడాది సంక్రాంతి సెలవులకు తోడుగా వారాంతపు శని, ఆదివారాలు రావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని తట్టుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) రాష్ట్రవ్యాప్తంగా 6,431 ప్రత్యేక బస్సులను నడిపింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ స్పెషల్ సర్వీసుల ద్వారానే రోజుకు అదనంగా రూ.2.70 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తాయనే భావన, ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం వంటి కారణాలతో ప్రజలు ప్రభుత్వ బస్సులకే మొగ్గు చూపారు.

మహాలక్ష్మి పథకం ఉన్నా పెరిగిన పెయిడ్ ప్రయాణికులు

మహాలక్షి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నప్పటికీ, పండుగ సీజన్లో పెయిడ్ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడం సంస్థకు ఆర్థికంగా కలిసొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీజీఎస్ఆర్టీసీకి ఈ ఆదాయం(RTC Income) గొప్ప ఊరటనిచ్చింది. పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణాల కోసం కూడా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల లభ్యతపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఈ పండుగ సీజన్లో వచ్చిన ఆదాయంతో భవిష్యత్తులో మరిన్ని ఆధునిక బస్సులను ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ యోచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Public transport Telangana RTC Revenue Sankranti festival Special buses telangana rtc TGSRTC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.