కొత్త సంవత్సరం వేడుకలు తెలంగాణ (Telangana) లో మద్యం అమ్మకాలకు కొత్త రికార్డులను సృష్టించాయి. డిసెంబర్ 31 రాత్రి రాష్ట్రవ్యాప్తంగా బార్లు, పబ్బులు, క్లబ్బులు జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఎక్కడ చూసినా నగరంలో మందుబాబుల సందడి కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటి గంటల వరకు మద్యం దుకాణాలకు సమయమిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు, పబ్స్ రాత్రి ఒంటి గంటల వరకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.
Read Also: Jagadgirigutta: మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయి
రాష్ట్రవ్యాప్తంగా (Telangana) ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువ చేసే మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది న్యూ ఇయర్‌కు మద్యం అమ్మకాలు మరింత పెరిగాయి. గత ఏడాదిలో పోలిస్తే ఈ సారి అదనంగా వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ రాత్రి అమ్మకాల లెక్కలు ఇంకా బయటకు రాలేదు. అవి బయటకు వస్తే ఈ సారి ఆల్ టైం రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగనున్నాయని తెలుస్తోంది. మద్యం పాలసీ మార్చడం వల్లే లిక్కర్ సేల్స్ పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: