📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Housing Survey: ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఎవరికి ఇల్లు వస్తుందంటే?

Author Icon By Pooja
Updated: March 16, 2026 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Housing Survey: తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్త వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేక పూరి గుడిసెలు, తాత్కాలిక టార్పాలిన్ షెడ్లలో నివసిస్తున్న వారిని గుర్తించి, వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

Read Also:TG Assembly Sessions: ఆరు గ్యారంటీలు ఎక్కడ? ప్రభుత్వాన్ని ఎండగడతామన్న మహేశ్వర్‌రెడ్డి.

Telangana Housing Survey: Indiramma Housing Survey Begins Today—Who Is Eligible for a House?

మార్చి నాలుగో వారం నుంచి రాష్ట్రవ్యాప్త సర్వే

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మార్చి నాలుగో వారంలో గ్రామాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, అత్యంత నిరుపేదలుగా ఉన్న వారి వివరాలతో కూడిన నివేదికను అధికారులు తయారు చేస్తారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రతి జిల్లాలోనూ పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగేలా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.

అంతేకాకుండా, గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతే, వారి అంగీకారంతో ఆ కోటాను కొత్తగా గుర్తించిన పేదలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నిధులు వృథా కాకుండా, నిజమైన అవసరమున్న వారికి త్వరగా గూడు లభిస్తుంది. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే లక్ష్యంగా ఈ సర్వే ముందుకు సాగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

#CongressGovernment #HousingSurvey #IndirammaIndlu #TelanganaHousingScheme

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.