Telangana: భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించడం ద్వారా పంటల దిగుబడి పెరగడంతోపాటు నేల ఆరోగ్యం దీర్ఘకాలికంగా మెరుగుపడుతుందని అన్నదాతలకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధనా డైరెక్టర్ డాక్టర్ ఎ. బలరాం సూచించారు. సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొం దించడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు.
Read also: Chittoor Crime: రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య
సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
ఈమేరకు నేల పరీక్షలు, స్థానిక వాతావరణ ప్రభావాలు, పంటల వ్యవస్థలు, సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం బుధవారం సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్(సిహెచ్ఎర్త్లో) లో ప్రారంభమైంది. ఈ రకమైన శిక్షణ ద్వారా సొంతంగా లాబరేటరీని ఏర్పాటు చేసుకునే నైపుణ్యం పొందవచ్చని తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అధికారి డా. ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ… రైతులకు శాస్త్రీయ వ్యవ సాయ పరిజ్ఞానం చేరేలా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయో గకరమని చెప్పారు. పరిశోధనా సంస్థలు అభివృద్ది చేసిన సాంకేతికతలను రైతులకు చేరవేయడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచవచ్చని తెలిపారు.
సిహెచ్ఎర్డీ డైరెక్టర్ డా. ఎం. జగన్ మోహన్రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను పరిచయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. ఈ శిక్షణలో నేల నమూనాల సేకరణ, నేల పరీక్ష విధానాలు, నేల పరీక్ష ఫలితాల విశ్లేషణ, వాతావరణ ప్రభావాల అవగాహన, పంటల ప్రణాళిక, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి శాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు శ్రీదేవి. సుకృతకుమార్, డా. ఎం. శంకర్, డా. రెడ్డిప్రియ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: