📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Local body elections: సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హై కోర్టు తీర్పు

Author Icon By Sharanya
Updated: June 25, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) నిర్వహించాల్సిన నేపథ్యంలో హైకోర్టు కీలకంగా జోక్యం చేసుకుంది. గతంలో నుంచీ పెండింగ్‌లో ఉన్న స్థానిక ఎన్నికలపై విచారణ చేపట్టిన హైకోర్టు, తేలికపాటి వ్యాఖ్యలు కాకుండా నేరుగా గడువు విధించింది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలలో కొత్త దారులు తెరిచింది.

హైకోర్టు తీర్పు నేపథ్యం

2024 ఫిబ్రవరి 1న గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్‌ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలని ఇటీవల ప్రభుత్వం కోర్టుకు తెలుపగా, ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్‌ కోరింది. ఈ వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్‌ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది.

రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ గందరగోళం

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు చేయనున్నారు. 42 శాతం మంది బీసీలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షితో పాటు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లపై విధానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read also: Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల కోసం కన్నతండ్రిపై దాడి చేసిన కుమారుడు

Hydra: రహదారులు నీటమునగకుండా అన్ని శాఖలతో సమన్వయం: హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్

#BCReservations #ElectionCommission #GramPanchayatElections #HighCourtVerdict #LocalBodyElections #TelanganaElections #TelanganaHC Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.