తెలంగాణలో వర్షాలు మళ్లీ విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోజు ఉత్తర మరియు తూర్పు తెలంగాణ (Telangana)జిల్లాల్లో విస్తృత వర్షపాతం నమోదవనుంది. ముఖ్యంగా కింది జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది:
ఆదిలాబాద్,కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి(Peddapalli), జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపటి వర్ష సూచన – ఇంకా ఎక్కువ జిల్లాలకు అలర్ట్
రేపటి రోజున కూడా బహుళ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలు ఇవే:
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
జాగ్రత్తలు తప్పనిసరి
- ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు
- లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి
- విద్యుత్ నిలిపివేతలు, రహదారి బందులు వంటి ఇబ్బందులకు సిద్ధంగా ఉండాలి
- అధికార యంత్రాంగం నుండి వచ్చే సూచనలను పాటించాలి
Read hindi news: hindi.vaartha.com
Read Also: